పీసీ క్రియేషన్స్ పతాకంపై వరుణ్.కె దర్శకత్వలో ప్రదీప్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘భోగి’. సస్పెన్స్ కధాంశంతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై మంచి ప్రజాదరణ పొందింది. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్.కె మాట్లాడుతూ,’నేను కెరీర్ తొలినాళ్లలో 15కి పైగా షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను. రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. అప్పుడు నాతో కలిసి పనిచేసిన ప్రదీప్ చంద్రతో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేశాను. నేను అనుకున్న లైన్ బాగా నచ్చడంతో 2022లో ఈ చిత్రాన్ని ప్రారంభించాం.కథకు తగ్గట్లుగానే ‘భోగి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో మీ ముందుకు వస్తున్నాం.త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, విడుదల చేస్తాం’ అని తెలిపారు.