నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణం లోని శ్రీ భాషిత పాఠశాలలో. శనివారం భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ను సంప్రదాయబద్ధంగా, గంగిరెద్దు ఆటలతో ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పల్లె సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అలంకరించబడింది. భోగి పండుగ ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా భోగి మంటలు, సంప్రదాయ అలంకరణలు ఏర్పాటు చేశారు.విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలు ధరించి భోగి పండుగలకు సంబంధించిన పాటలు, జానపద నృత్యాలు, ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ ల ద్వారా పాతదాన్ని విడిచిపెట్టి కొత్త ఆలోచనలకు స్వాగతం పలికే సందేశాన్ని విద్యార్థులకు అందించామని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే ఈ వేడుకల లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని భోగి వేడుకలను ఆనందోత్సాహాలతో విజయవంతంగా నిర్వహించారు.
శ్రీ భాషిత పాఠశాలలో భోగి , సంక్రాంతి , కనుమ ,సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



