- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ధర్మోరా, చిక్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ అధికారులు సోమవారం నిర్వహించారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వమండిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేయడం జరిగిందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బర్రోళ్ల అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లక్ష్మా రెడ్డి, మండలంపంచయతి అధికారి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శులు నవీన్, సంతోష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -