Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హసకొత్తూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు బుధవారం భూమి పూజ నిర్వహించారు. కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు పోసి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. అర్హులు ఎవరైనా ఇండ్లు మంజూరు కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి కూడా ప్రభుత్వం తప్పకుండా ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపిడీ లింగరెడ్డి, కుందేటి శ్రీనివాస్, మోదీనీ శ్రీధర్, మంద భాగ్యలక్ష్మి, కల్లెడ లలిత, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల శ్రీకాంత్, బద్దం రవి, మేడమ్ రమేష్, మోదిని శ్రీధర్, మేకల క్రాంతి, పడల మల్లేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -