Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి…

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి…

- Advertisement -

– జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రోజు యాదగిరి గుట్ట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో యాదగిరిపల్లి గ్రామం భూ భారతి రెవిన్యూ సదస్సు  లో పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.  భూ భారతి రెవిన్యూ సదస్సు లో రైతులతో మాట్లాడి  వారి సమస్యలు కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.జూన్, 20 తేది వరకుఅన్ని గ్రామాల లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న నూతన భూభారతి రెవెన్యూ చట్టం 2025, రెవెన్యూ గ్రామసభల పై రైతులు ప్రత్యేకంగా అవగాహన పెంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సదస్సులను పక్కాగా వినియోగించుకోవాలన్నారు,  అందుకనుగుణంగా దరఖాస్తులను పూర్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ లను, రిజిస్టర్ల ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని రైతులకు తెలియజేశారు.భూ భారతి చట్టంలో రైతుల భూముల సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయని రైతులకు తెలియజేశారు. దరఖాస్తు చేయడం కోసం వచ్చే వారికి హెల్ప్ డెస్క్ లు  పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రైతులకు తెలియజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -