Monday, December 8, 2025
E-PAPER
Homeనిజామాబాద్వాసవి క్లబ్ జిల్లా వైస్ గవర్నర్‌గా బీబీపేట వాసి భాశెట్టి నాగేశ్వర్

వాసవి క్లబ్ జిల్లా వైస్ గవర్నర్‌గా బీబీపేట వాసి భాశెట్టి నాగేశ్వర్

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: వాసవి క్లబ్ జిల్లా వైస్ చైర్మన్‌గా బిబిపేట వాసి బాసెట్టి నాగేశ్వర్ ఎన్నికయ్యారు. అరవపల్లి పురుషోత్తం కళ్యాణమండపం నిజామాబాద్‌లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ వాసవి క్లబ్ జిల్లా వి 103 ఎ యొక్క 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశామ‌ని నూతన వాసవి క్లబ్ వైస్ గవర్నర్‌గా నియమితులైన బాసెట్టి నాగేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ గా వి ఎన్ బాశెట్టి నాగేశ్వర్, ప్రాంతీయ కార్యదర్శిగా విఎన్ మోటూరి శ్రీకాంత్, జోన్ చైర్మన్‌గా విఎన్ తడుపుదురి నాగభూషణం లు ఎన్నిక కావడం అట్లాగే ప్రమాణ స్వీకారం చేశామ‌న్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ వాసవి క్లబ్ కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్, జిల్లా గవర్నర్ నరాల శ్రీనివాస్ లు ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. ఇందులో బీబీపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ యాదగిరి, వాసవి మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వప్రసాద్, తాటిపల్లి రమేష్, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, సభ్యులు నంగునూరు చంద్రశేఖర్, బశెట్టి వెంకటేశం, నీల బైరయ్య, గాంధారి సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -