- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో బాణాసంచా విక్రయాలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నగర పరిధిలో తాత్కాలికంగా ఫైర్ క్రాకర్లను విక్రయించే వారికి ఎక్స్‌ప్లోసివ్స్ యాక్ట్-1983 ప్రకారం లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు సీటీ పోలీస్ కార్యాలయం తెలిపింది. అనుమతి లేకుండా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లైసెన్స్‌ల కోసం అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు మాన్యువల్‌గా ఫామ్ AE-5 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
- Advertisement -