- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి వ్యక్తిగత వాహనాల ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంచనుంది. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న వార్షిక పాస్ ధర 2.5 శాతం పెరిగి రూ.3,075 కు చేరుకోనుంది. ఈ పాస్ ద్వారా దేశంలో ఉన్న 200 టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. రహదారి రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా ఈ ధరలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు లోపు రీఛార్జ్ చేసుకునే వారు పాత ధర రూ.3 వేలకే వార్షిక పాస్‌ను పొందే అవకాశం కల్పించారు.
- Advertisement -



