- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (టెక్స్టైల్) శాఖ 2025-26 బడ్జెట్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఋణమాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ అనుమతి ఇచ్చింది. ఈ నిధులు”చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం” కింద విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హ్యాండ్లూమ్స్, అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -