Thursday, November 27, 2025
E-PAPER
Homeజాతీయంఅన్నాడీఎంకేకు భారీ షాక్

అన్నాడీఎంకేకు భారీ షాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వ‌చ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు, అన్నాడీఎంకే బహిష్క్రత నేత సెంగోట్టయన్ టీవీకే గూటికి చేరారు. సెంగోట్టయన్ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోబిచెట్టిపాళయం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. సెంగోట్టయన్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద ఎత్తున అభిమానులు, మద్దతుదారులతో తరలివచ్చిన సెంగోట్టయన్.. తమిళగ వెట్రి కజగం (టీవీకే)లో చేరారు.

టీవీకేలో సెంగోట్ట‌య‌న్ చేరిక‌పై అన్నాడీఎంకే అగ్రనేత ప‌ళ‌ని స్వామి స్పందించారు. ఆయ‌న చేరిక‌పై స్పందించాల్సిన అవ‌స‌రంలేద‌ని, పార్టీకి ఆయ‌న అవ‌స‌రంలేద‌ని మీడియా స‌మావేశంలో చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -