నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ రాష్ట్రంలో ఎదురుదెబ్బతగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ స్థాయిల్లోని మూడు డజన్లు మంది కీలక నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరిన ముఖ్యనేతలల్లో పంజాబ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు (ఎస్సీ వింగ్) సాహిబ్ సింగ్ ఛజ్జల్వాడి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు (అమృత్‌సర్ రూరల్) సరబ్‌జిత్ కౌర్‌తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంతేకాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, భారతీయ జనతా పార్టీలకు చెందిన దాదాపు మూడు డజన్ల మంది సర్పంచులు, పంచులు, సీనియర్ నాయకులు పార్టీలో చేరారు. వారందర్నీ సీఎం OSD రాజ్‌వీర్ సింగ్ ఘుమన్, నాయకులందరినీ లాంఛనంగా ఆప్ పార్టీలోకి చేర్చుకున్నారు.
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



