- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. NCB ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావాలో షారుఖ్‌కి చెందిన రెడ్ చిల్లీస్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్, ఇతర ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది. కోర్టు రెడ్ చిల్లీస్, నెట్‌ఫ్లిక్స్ ప్రతివాదులు ఏడు రోజుల్లో సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ ‘ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’ తన ప్రతిష్టను దిగజార్చిందని వాంఖడే పిటిషన్‌లో పేర్కొన్నారు.
- Advertisement -