Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలు టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు బుమ్రా దూరం!

 టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు బుమ్రా దూరం!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, బర్మింగ్‌హామ్ వేదికగా జులై 2న ప్రారంభం కానున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. పనిభారం నిర్వహణలో భాగంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం. అయితే, ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

లీడ్స్‌లో ముగిసిన మొదటి టెస్టులో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి భారత బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. అయితే, అతడికి ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం అందలేదు. యువ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ప్రసిధ్ కృష్ణ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 35 ఓవర్లలో 220 పరుగులు సమర్పించుకోగా, సిరాజ్ 41 ఓవర్లలో 173 పరుగులిచ్చి కేవలం రెండు వికెట్లకే పరిమితమయ్యాడు. బుమ్రా ఒక్కడే 43.4 ఓవర్లలో 3.20 ఎకానమీ రేటుతో 140 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, మిగిలిన పేసర్లు దారుణంగా విఫలమవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img