Friday, January 9, 2026
E-PAPER
Homeఆటలుటీమ్ ఇండియాకు భారీ షాక్..కీలక ప్లేయర్ దూరం

టీమ్ ఇండియాకు భారీ షాక్..కీలక ప్లేయర్ దూరం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తిలక్ వర్మకు పొట్ట కింది భాగంలో గాయమైంది. అతనికి శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలోనే జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల అతనికి పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. తక్షణమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో అతనికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా వైద్యులు తెలిపారు. తిలక్ వర్మ మూడు, నాలుగు వారాలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది అని డాక్టర్లు తెలిపారు. ఏది ఏమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తిలక్ టీ20 ప్రపంచ కప్ ముందు గాయపడటం టీమ్ఇండియాకు భారీ దెబ్బే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -