Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దపులి..

ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దపులి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. బోథ్‌ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఏమరకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని వెల్లడించారు. కాగా, గత గురువారం బోథ్‌ అతవీ ప్రాంతంలో ఓ దూడపై పెద్దపులి దాడి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -