Tuesday, March 10, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేడేట్

ఐపీఎల్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేడేట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టోర్నమెంట్ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను ఈ నెల‌ 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. 19వ ఎడిషన్ ఐపీఎల్ ఈ నెల‌ 28 నుంచి మే 31 వరకు జరగనుంది. మొత్తం షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించకపోవడానికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు ఎన్నికలతో ఇబ్బంది లేకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. “ప్రస్తుతానికి తొలి 20 రోజుల షెడ్యూల్ ప్రకటిస్తున్నాం. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను విడుదల చేస్తాం” అని సైకియా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -