Friday, September 19, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బిగ్‌బాస్ 9 వచ్చేస్తోంది.. 'ఈసారి చదరంగం కాదు రణరంగమే'

బిగ్‌బాస్ 9 వచ్చేస్తోంది.. ‘ఈసారి చదరంగం కాదు రణరంగమే’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుందని నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. ఈ షోకు హోస్ట్‌గా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరించనుండగా, “ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో సరికొత్త ప్రోమోను విడుదల చేశారు.

బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా కొత్త సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ నిర్వాహకులు సీజన్ 9కి సంబంధించిన మొదటి అప్‌డేట్‌ను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ ప్రోమోలో వ్యాఖ్యాత నాగార్జున కనిపించి, రాబోయే సీజన్ మరింత వాడివేడిగా, ఉత్కంఠభరితంగా ఉండబోతోందని సంకేతాలిచ్చారు.

గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండనుందని “చదరంగం కాదు.. రణరంగమే” అనే ట్యాగ్‌లైన్‌ స్పష్టం చేస్తోంది. వ్యూహాలు, ఎత్తుగడలతో సాగే ఆటలా కాకుండా, నిజమైన పోరాట క్షేత్రాన్ని తలపించేలా ఈ సీజన్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో షోపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -