Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్bigg boss 9 telugu : కంటెస్టెంట్‌లు వీళ్లే..

bigg boss 9 telugu : కంటెస్టెంట్‌లు వీళ్లే..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్‌ మొదలైంది. ఇప్పటివరకూ 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సరికొత్త హంగులతో 9వది షురూ అయింది. ఈసారి ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులతో ఉంటుందని వ్యాఖ్యాతగా నాగార్జున చెప్పారు. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు, సామాన్యులకు సమాన అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటిక ప్రకటించారు. ఇందులో భాగంగా నిర్వహించిన బిగ్‌బాస్‌ అగ్ని పరీక్షను దాటుకుని 13మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక సెలబ్రిటీలను ఒక్కొక్కరినీ నాగార్జున ప్రేక్షకులకు పరిచయం చేశారు.

సీజన్‌9లో తొలి కంటెస్టెంట్‌గా బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ‘నీ గురించి 9 మాటల్లో ప్రేక్షకులకు చెప్పు’ అని నాగ్‌ అడగ్గా, తాను ‘ఫ్యామిలీ గర్ల్స్‌, ఓవర్‌ థింకర్‌, సెన్సిటివ్‌,మూడీ, క్రేజీ, అందంగా ఉంటాను, బాగా వండుతా, అమాయకత్వం, అనుకుంటే అస్సలు వదిలి పెట్టనితత్వం’ అంటూ చెప్పుకొచ్చింది. హౌస్‌లో మాత్రం అమాయకంగా ఉంటే కుదరదంటూ సరదాగా వ్యాఖ్యానించింది. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియదని చెప్పింది. వాళ్లు సంతోషించేలా నడుకుంటానని హామీ ఇచ్చింది.

ఇక ఈ సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా నటి ఫ్లోరా షైనీ (ఆశాషైనీ) అడుగు పెట్టారు. ‘నరసింహ నాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కెరీర్‌ తొలినాళ్లలో వరుస అవకాశాలు దక్కించుకున్న తాను, ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వాటిని అధిగమించి మళ్లీ తనని తాను నిరూపించుకున్నానని, బిగ్‌బాస్‌ వేదికతో మరోసారి నిలబడతానని అన్నారు.

ఇక సామాన్యుల కల్యాణ్‌ పడాల హౌస్‌లోకి అడుగు పెట్టాడు. బిగ్‌బాస్‌ టీమ్‌ నిర్వహించిన అగ్ని పరీక్ష దాటుకుని ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కల్యాణ్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో అతడు హౌస్‌లోకి అడుగు పెట్టిన మూడో కంటెస్టెంట్‌ అయ్యారు.

ఈ సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా సెలబ్రిటీల నుంచి ఇమ్మాన్యుయేల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ‘జబర్దస్త్‌’ షో ద్వారా ఇమ్మాన్యుయేల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు సైతం వినోదాన్ని పంచుతానని ఈ సందర్భంగా అన్నారు.

బిగ్ బాస్ హౌస్‌లోకి ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీకి ముందు అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. తనకు బిగ్ బాస్ అంటే ప్రాణమని… హౌస్‌లో మనలో ఉన్న రియాలిటీ బయటకు వస్తుందని చెప్పారు. ‘మనమే’ మూవీలో శర్వానంద్‌కు, రీసెంట్‌గా ‘పుష్ప 2’లో పాటలకు కొరియోగ్రఫీ చేసినట్లు తెలిపారు. ‘ఢీ’ షోతో పరిచయమైన శ్రష్టి … జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. తనను లైంగికంగా వేధించారంటూ ఆమె ఆయనపై కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారారు.

ఆరవ కంటెస్టెంట్ గా మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు

ఏడవ కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు భరణి శంకర్ ఎంట్రీ ఇచ్చాడు భరణి ఎంట్రీ ఇస్తున్న సమయంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో పాటు ఒక బాక్స్ తీసుకొచ్చిన భరణి అది ఉంటేనే లోపలికి వెళ్తానన్నాడు కానీ దానికి బిగ్ బాస్ ఒప్పుకోలేదు. ఆ బాక్స్ లో ఏముందో బయటకు తీసి మెడలో ధరించి లేదా సీక్రెట్ బయటకు చెప్పి లోపలికి వెళ్లాలని చెప్పాడు. కానీ తను ఆ పని చేయలేనని చెప్పడంతో వెనక్కి వెళ్ళిపోవచ్చు అని సూచించారు. దీంతో భరణి వెనక్కి వెళ్ళిపోయాడు. కాగా కొద్దిసేప‌టి త‌ర్వాత భ‌ర‌ణి మ‌ళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్‌లో త‌న ల‌క్కీ లాకేట్‌ను తీసుకుని వ‌చ్చారు.

బిగ్ బాస్ 9లోకి సీరియల్ నటి రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది .

      - Advertisement -
      spot_img
      RELATED ARTICLES
      - Advertisment -

      తాజా వార్తలు

      - Advertisment -spot_img
      Ad
      Ad