నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9 సీజన్ సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ కానుంది. అయితే ఈ సీజన్‌కు కూడా హీరో అక్కినేని నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి హౌస్‌లోకి ఎవరు రాబోతున్నారు.. ఎలాంటి కంటెస్టెంట్లని దించుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారెవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం..
పచ్చళ్లతో బాగా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి ఫేమ్ రమ్య మోక్ష, బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి, అమర్ తేజ్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ యాక్టర్ నవ్య స్వామి, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్, నటుడు సాయి కిరణ్, ముఖేష్ గౌడ, ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్, సుమంత్ అశ్విన్, సీరియల్ హీరోయిన్ దేబ్జానీ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ లిస్ట్ అఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.