నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్ అధికార్ యాత్రతో బీహార్ ప్రజల్లో చైతన్యం మొదలైందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. దీంతో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలు ప్రతిఘటిస్తున్నారని, త్వరలో దేశవ్యాప్తంగా ఈసీ చర్యలను అడ్డుకొనున్నారని ఆయన దీమా వ్యక్తం చేశారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ ఓట్ చోరీ వ్యవహారంపై మాట్లాడుకుంటున్నారని, ఇది నిజమని, ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి ఈసీ తెరలేపిందని మరోసారి ఆరోపించారు.
త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎస్ఐఆర్ పేరుతో ఆ రాష్ట్రంలో సమగ్ర ఓటర్ జాబితాను ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. అదే విధంగా ఇటీవల సవరించిన ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేసింది. ఓట్ల సవరణలో అనేక లోపాలున్నాయని, తప్పులతడకగా ఓటర్ జాబితాను ఈసీ తయారు చేసింది విపక్షాలు మండిపడుతున్నాయి. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించారని, ఈసీ బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తుందని పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈక్రమంలో ఇండియా బాక్ల్ కూటమి పార్టీలతో ప్రతిపక్ష నేత గత ఆదివారం ఓటర్ అధికార్ యాత్ర పేరుతో బీహార్‌లోని ససారంలో ఆయన యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.