- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి (ఆదివారం)తో ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు పూర్తవుతుంది. చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. బీజేపీ తరఫున అగ్రనేతలు, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి.
- Advertisement -



