- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఈరోజు జేడీయూ ప్రకటించింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన తర్వాత జేడీయూ అభ్యర్థుల ఈ జాబితాను విడుదల చేసింది.
ఇటీవల ఎన్డీఏ కూటమితో పొత్తులో భాగంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించింది. ప్రస్తుతం 57 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం నితీష్ కుమార్ రేపు తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆయన మొదటి దశలో అభ్యర్థుల నామినేషన్లకు కూడా హాజరవుతారు. కోసి ప్రాంతంలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగిస్తారు.
- Advertisement -