- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ నేడు ప్రకటించనుంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల తేదీలు ప్రకటించనుంది. రెండు విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. నవంబర్ 22లోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కూడా ఈసీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
- Advertisement -