Wednesday, November 5, 2025
E-PAPER
Homeజాతీయంరేపు బీహార్ తొలి విడ‌త పోలింగ్

రేపు బీహార్ తొలి విడ‌త పోలింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పలువురు ప్రముఖ నేతల భవితవ్యం తేలనుంది.

కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాల‌కు రెండు ద‌ఫాలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రేపు 121 స్థానాలకు ఎన్నిక‌లు రేపు 121 స్థానాలకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.. 11న మిగిలిన స్థానాల‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 14న వెల్ల‌డించే ఫ‌లితాల‌తో నేతల భవితవ్యం తేలనుంది.

మ‌రోవైపు ఎన్డీయే కూట‌మి, ఇండియా బ్లాక్ ల మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు కూట‌ములు హోరాహోరీగా ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించాయి. ఎన్డేయే ప్ర‌ధాన భాగ‌స్వామి జేడియే మ‌రోసారి అధికారం చేప‌ట్టాల‌ని క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇండియా బ్లాక్ ప్ర‌ధాన భాగ‌స్వామి ఆర్జేడీ కూడా వ్యూహాత్మంగా పావులు క‌దుపుతోంది.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్‌లోని 16 మంది మంత్రులు ఈ దశలో తమ స్థానాలను నిలబెట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు, జనశక్తి జనతాదళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తమ స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -