నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ , ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబిహెచ్ఎఫ్ఎల్), శంషాబాద్ లో ఒక కొత్త శాఖను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించింది. ఈ శాఖ ప్రారంభంతో తెలంగాణలో ఏబిహెచ్ఎఫ్ఎల్ యొక్క మొత్తం నెట్వర్క్ 13 శాఖలకు పెరిగింది.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, స్థానిక వాణిజ్యం, రవాణా, లాజిస్టిక్స్ , ఆతిథ్య రంగాల ద్వారా హైదరాబాద్ దక్షిణ శివార్లలో ఒక ముఖ్యమైన వాణిజ్య , నివాస కేంద్రంగా శంషాబాద్ అభివృద్ధి చెందుతోంది. తమ కొత్త శాఖ ద్వారా, ఏబిహెచ్ఎఫ్ఎల్ సౌకర్యవంతమైన గృహ రుణాలను వినియోగదారులకు మరింత చేరువ చేసి, సొంత ఇల్లు అనే వారి ఆకాంక్షలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న నిపుణులు సహా వివిధ రకాల వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర గృహ రుణ పరిష్కారాలను ఏబిహెచ్ఎఫ్ఎల్ అందిస్తుంది; వీటిలో అందుబాటు ధరల గృహ రుణాలు, ప్రీమియం గృహ రుణాలు, నిర్మాణ రుణాలు, ఆస్తిపై రుణాలు వంటి సేవలు ఉన్నాయి.
ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, ఏబిహెచ్ఎఫ్ఎల్ అక్టోబరు 26 నుండి నవంబరు 30 , 2026 వరకు వర్తించేలా, ఎటువంటి లాగిన్ ఫీజులు లేకుండా రూ. 50 లక్షల వరకు తక్షణ రుణ మంజూరు సౌకర్యంతో కూడిన ప్రత్యేక ఆఫర్ను అందిస్తోంది. దీని ద్వారా ఈ కొత్త శాఖలలోని వినియోగదారులు మరింత వేగంగా, అందుబాటు ధరలో రుణ సదుపాయాన్ని పొందగలుగుతారు.
ఈ విస్తరణపై ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ శ్రీ పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, “తెలంగాణా మాకు ఒక కీలకమైన వృద్ధి మార్కెట్. మెరుగైన డిమాండ్ , పెరుగుతున్న ఆకాంక్షల దృష్ట్యా, వినియోగదారులతో మా అనుబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి మేము మా ప్రాంతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్నాము. మా విస్తరిస్తోన్న పంపిణీ వ్యవస్థను పటిష్టమైన డిజిటల్ సామర్థ్యాలతో మేళవించడం ద్వారా వినియోగదారులకు గృహ యాజమాన్య ప్రయాణాన్ని సరళంగా, వేగంగా , అవాంతరాలు లేకుండా చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.






కామెంట్లు (0)