Magazines

నెలాఖరు నుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు..!

20 నిమిషాల క్రితం

From the end of the month,  charges on UPI payments..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : యూపీఐ లావాదేవీలపై ర్జీలు వసూలు చేయడానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌‌పిసిఐ) మళ్లీ కసరత్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. రూ.2,000కు మించిన యుపిఐ వ్యాపార చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎమ్‌డిఆర్‌) విధించాలని మోడీ సర్కార్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 15 నుంచి ఈ రుసుములను అమలు చేయాలని తొలుత భావించిన ఎన్‌‌పిసిఐ దీపావళి నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. పండుగ సీజన్‌ ముగియడంతో కొత్త తేదీని ఖరారు చేసే కసరత్తు జరుగుతోంది. నవంబర్‌ నెలాఖరుకు అమల్లోకి రావచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. రూ.2,000లోపు వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎమ్‌డిఆర్‌ విధించాలని.. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్