Magazines

ఈక్విటీ ఎంఎఫ్‌‌ల్లో తగ్గిన పెట్టుబడులు

26 నిమిషాల క్రితం

Investments in equity mutual funds have declined
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్‌‌లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి రూ.1.74 లక్షల కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయని యాంఫీ వెల్లడించింది. అసోసియేషన్‌ ఆఫ్‌ ‌మ్యూచువల్‌ ‌ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా (యాంఫీ) రిపోర్ట్‌ ‌ప్రకారం.. ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు 14 శాతం తగ్గి రూ.32,993 కోట్లకు పరిమితమైనప్పటికీ.. మిడ్‌క్యాప్ విభాగం రూ.9,484 కోట్లను ఆకర్షించింది. కొత్తగా 9.64 లక్షల ఫోలియో లు చేరాయి. ‘అక్టోబరులో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు రూ.1.74 లక్షల కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. దీంతో నిర్వహణలోని ఆస్తుల విలువ (ఎయుఎం) నెలవారీగా 0.9 శాతం పెరిగి రూ.83.39 లక్షల కోట్లకు చేరింది. ఈ నెలలో నికరంగా 15.80 లక్షల ఫోలియోలు జతకావడంతో మొత్తం ఫోలియోల సంఖ్య 28.78 కోట్లకు పెరిగింది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి రూ.32,994 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. దీంతో వరుసగా 68వ నెల కూడా ఈ విభాగంలో సానుకూల పెట్టు బడుల ప్రవాహం నమోదైంది. పెట్టుబడి దారుల భాగస్వామ్యం నిలకడగా కొనసాగు తోంది. అక్టోబరులో దాదాపు 10 కోట్ల సిప్‌ ఖాతాల ద్వారా రూ.32,160 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 8.9 శాతం అధికం. వరుసగా మూడో నెల కూడా సిప్‌ పెట్టుబడులు రూ.32,000 కోట్ల మార్కును దాటాయి.’ అని యాంఫీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ చలసాని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్