Magazines

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

4 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్ మరియు మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్‌టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం మరియు పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశపు అగ్రగామి ఆరోగ్య బీమా సంస్థల్లో ఒకటైన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత ప్రజలందరు భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, అధికారిక ప్రభుత్వ సలహాలను పాటించాలని, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.


వర్షాలు తగ్గిన తర్వాత ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. వర్షం ఒక్కసారి తగ్గాక రెండు, మూడు వారాల తర్వాత కలుషిత సరఫరా వ్యవస్థలు, ఓపెన్ స్టోరేజ్‌ల వల్ల టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఎ, డయేరియాలాంటి వ్యాధులు ప్రబలవచ్చు. కంటైనర్లు, టెర్రస్‌పై నిలవ ఉండిపోయిన నీరు, డెంగ్యూ, మలేరియాకారక దోమలకు ఆవాసంగా మారవచ్చు. రహదారులు, విద్యుత్, రవాణా సదుపాయాలు చాలా రోజుల వరకు అందుబాటులో ఉండకపోవచ్చు. దీనితో వైద్య సలహా సేవలు అవసరమైన కచ్చితమైన ప్రాంతానికి చేరుకోవాలంటే డాక్టర్లకు సవాళ్లు ఎదురుకావచ్చు.  ఫలితంగా సీనియర్ సిటిజన్లు, పిల్లలు, అలాగే ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ముప్పు పొంచి ఉంది. ఎలాంటి అనారోగ్య సంకేతాలైనా తొలినాళ్లలో దాదాపు ఒకే రకంగా కనిపించవచ్చు. వీటిలో వ్యత్యాసాలను కేవలం డాక్టరు మాత్రమే గుర్తించగలరు. అందుకే ప్రజలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సత్వరం వైద్య సలహాలు పొందాలని స్టార్ హెల్త్ కోరుతోంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావిత తీర ప్రాంతాల్లో కుటుంబాలు తీసుకోతగిన ముందస్తు జాగ్రత్త చర్యలు

·       కేవలం కాచి చల్లార్చిన లేదా క్లోరినేట్ చేసిన నీటినే తాగాలి. నీటిని నిల్వ చేసే పాత్రలను తప్పనిసరిగా మూత వేసి ఉంచాలి.

·       వరదనీరును తాకిన పక్షంలో సబ్బుతో చేతులు కడుక్కోవాలి. వరద నీరు తగిలిన ఆహారాన్ని పారవేయాలి.

·       వరదనీరు గుండా వెళ్లకూడదు. గాయాలేవైనా ఉంటే ప్లాస్టర్లులాంటివి వేసి కవర్ చేయాలి. నీటి మధ్యలో ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలకు దూరంగా ఉండాలి.

·       కంటైనర్లు, టైర్లు, టెర్రస్‌ల మీద నిల్చిపోయిన నీటిని తొలగించాలి. దోమ తెరలను, మస్కిటో రెపెలెంట్లను, అలాగే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ఉపయోగించాలి.

·       రెగ్యులర్‌గా వేసుకునే ఔషధాలు, ప్రిస్క్రిప్షన్లు, నోటి ద్వారా తీసుకునే రీహైడ్రేషన్ సాల్ట్‌లను అందుబాటులో, పొడిగా ఉంచుకోవాలి.

·       జ్వరం, డయేరియా, వాంతులు, ఒళ్లు నొప్పులు లేదా చర్మ సమస్యలు వచ్చిన పక్షంలో స్వీయ చికిత్స చేసుకోవడం కాకుండా సత్వరం డాక్టరును సంప్రదించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, తీవ్ర జ్వరం, బ్లీడింగ్, లేదా డీహైడ్రేషన్‌లాంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

·       తాగు నీరు, పారిశుధ్యం, ఫాగింగ్‌కి సంబంధించి జిల్లా ఆరోగ్య, మున్సిపల్ యంత్రాంగం సూచనలను పాటించాలి. 

·       లోతట్టు ప్రాంతాలు, కాలువలు, నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి. అధికారుల సూచనల మేరకు సురక్షిత కేంద్రాలకు వెళ్లాలి.


“వరద నీరు వెనక్కి పోయిన వారం లేదా రెండు వారాల తర్వాత జ్వరం వస్తే కుటుంబాలు అప్రమత్తం కావాలి. తప్పకుండా డాక్టరును సంప్రదించాలి. పలు రోజుల వరకు రహదారులు దిగ్బంధానికి గురికావచ్చు. రవాణా సరిగ్గా ఉండకపోవచ్చు. దీనితో వైద్య సలహా కోసం అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లడం చాలా కష్టతరం కావొచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటి వద్ద నుంచే డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చని మేము తెలియజేస్తున్నాం. దీనితో అనారోగ్య సంకేతాలు కనిపించిన వెంటనే, ఎలాంటి జాప్యం లేకుండా, సత్వరం వైద్య సలహాలు పొందేందుకు వీలవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన వెంటనే టెలీకన్సల్టేషన్‌ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం” అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ Mr. శ్రీనివాస్ కేబీబీ తెలిపారు.


బైటికి వెళ్లకుండానే డాక్టరును సంప్రదించవచ్చు: ప్రాంతీయంగా ఇంకా చాలా చోట్ల ప్రయాణాలు, విద్యుత్ సేవలకు అంతరాయం నెలకొన్నప్పటికీ స్టార్ హెల్త్ పాలసీదారులు అపరిమిత టెలీకన్సల్టేషన్లను పొందవచ్చు. క్యాష్‌లెస్ ప్రక్రియలు, నెట్‌వర్క్ ఆసుపత్రుల గురించిన వివరాల కోసం ఉదయం 8 గం. నుంచి రాత్రి 8 గం. వరకు 7200 222 333 నంబరుపై స్టార్‌ను సంప్రదించవచ్చు. ఇంటి వద్దే చికిత్స తీసుకోవచ్చని డాక్టరు సూచించిన పక్షంలో, పాలసీ షరతులకు లోబడి, నర్సింగ్, రక్త పరీక్షలు, ఐవీ ఫ్లూయిడ్లు మరియు ఇంజెక్షన్లు మొదలైన వాటికి క్యాష్‌లెస్ హోమ్ హెల్త్ కేర్ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ –సెప్టెంబర్ మధ్య కాలంతో పోలిస్తే 2026 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో దీని వినియోగం 4.2 రెట్లు పెరిగింది. పాలసీదారులు కాని వారు ఉదయం 8 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్టార్ హెల్త్ యాప్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్‌ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్