ఐపీఓ ధర కంటే దిగువకు..
రూ.41,000 కోట్ల సంపద ఆవిరి
ముంబయి : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) షేర్ లిస్టింగ్ రోజు నమోదైన లాభాలను కోల్పోయి ఐపిఒ ధర కంటే దిగువకు పడిపోయింది. సెప్టెంబర్ 24న రూ.1,785 ఐపిఒ ధరతో పోలిస్తే స్వల్ప లాభంతో రూ.1,800 వద్ద లిస్టయిన షేరు.. అదే రోజు రూ.1,878 గరిష్ఠాన్ని తాకింది. దీంతో ఎన్‌ఎస్‌ఇ మార్కెట్ విలువ రూ.4.64 లక్షల కోట్లకు చేరింది. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సోమవారం షేరు రూ.1,712 కనిష్ఠానికి పడిపోయింది. లిస్టింగ్ గరిష్ఠంతో పోలిస్తే దాదాపు 9 శాతం, ఐపిఒ ధరతో పోలిస్తే 4 శాతం నష్టపోయింది. షేరు పతనంతో ఎన్‌ఎస్‌ఇ గరిష్ఠ మార్కెట్ విలువ నుంచి దాదాపు రూ.41,000 కోట్ల సంపద ఆవిరైంది. ప్రస్తుతం సుమారు రూ.4.27 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 12వ స్థానానికి పడిపోయింది. మార్కెట్లకు చమురు ధరల ఊరట అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 685.34 పాయింట్లు పెరిగి 73,067.81కు చేరింది. నిఫ్టీ 220.35 పాయింట్లు లాభపడి 22,776.10 వద్ద ముగిసింది. రూపాయి విలువ డాలర్‌కు 96.43గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు ధర 98.64 డాలర్లుగా నమోదయ్యింది.






కామెంట్‌లు (0)