Magazines

పెట్రోల్‌ మంట.. డీజిల్‌ బాదుడు!

37 నిమిషాల క్రితం

crushing diesel costs!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నయారా ఎనర్జీ భారీగా ధరల పెంపు
న్యూఢిల్లీ : భారత్‌‌లో ఇంధన ధరల మంట మళ్లీ మొదలైంది. ప్రయివేటు ఇంధన రిటైలర్‌ నయారా ఎనర్జీ శనివారం నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచేసింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై ఆందోళనలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరలు పెరగడం రిటైలర్లపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోందని ఆ వర్గాలు తెలిపాయి. ధరల పెంపు నయారా ఎనర్జీకి ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చి 26న కూడా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. ఆ సమయంలో పెట్రోల్‌ ధర రూ.100.71, డీజిల్‌ ధర రూ.91.31కు చేరాయి. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గి చమురు ధరలు దిగిరావడంతో జులై 1న ఈ పెంపును వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మరోసారి ధరలు పెంచింది. దేశంలో ఈ సంస్థ 7,108 బంకులను కలిగి ఉంది. రిలయన్స్‌-బిపి 2,304 బంకులను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,04,137 పెట్రోల్‌ బంకుల్లో 90 శాతానికి పైగా వాటా కలిగిన ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీలు ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్