Magazines

ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌ల యాజమాన్యాన్ని సులభతరం చేయడంలో భాగంగా టాటా మోటార్స్, టర్నో భాగస్వామ్యం

1 గంట క్రితం

Mr. Sudhindra Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : టాటా మోటార్స్, భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, తన ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌ల (e-SCVPU) వినియోగదారులకు అనుకూలీకరించిన ఫైనాన్సింగ్ పథకాలను అందించేందుకు, భారతదేశపు తొలి బ్యాటరీ ఇంటెలిజెన్స్, లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ సంస్థ అయిన ఫిన్జో ఈవీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టర్నో)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా టాటా మోటార్స్ వినియోగదారులు త్వరితగతిన రుణ మంజూరు, సౌకర్యవంతమైన రుణ తిరిగి చెల్లింపు ప్రణాళికలు, వాహన విలువలో 25% హామీతో కూడిన బైబ్యాక్ సదుపాయాన్ని పొందగలుగుతారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ వరుణ్ నాయర్, డైరెక్టర్, టర్నో, “ఈవీ (EV) యాజమాన్యాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, వినియోగదారులకు మరింత లాభదాయకంగా మార్చడం ద్వారా భారతదేశవ్యాప్తంగా పర్యావరణహిత, ఉద్గార రహిత రవాణా వైపు మార్పును వేగవంతం చేయడమే టర్నో లక్ష్యం. ఎలక్ట్రిక్ వాణిజ్య రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, వినియోగదారులు తమ వాహనాల జీవితకాల విలువపై మరింత స్పష్టత, భరోసాను కోరుకుంటున్నారు. ఈ అవసరాలను తీర్చడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడాన్ని మరింత సులభతరం చేసేందుకు టాటా మోటార్స్‌తో మా భాగస్వామ్యం అనుకూలీకరించిన ఫైనాన్సింగ్ సదుపాయాలు, హామీతో కూడిన బైబ్యాక్ మద్దతును అందిస్తుంది. బ్యాటరీ ఇంటెలిజెన్స్, ఈవీ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌లో మాకున్న నైపుణ్యాన్ని, హామీతో కూడిన బైబ్యాక్ కార్యక్రమంతో సమన్వయం చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల కొనుగోలు, వినియోగం, పునఃవిక్రయ ప్రక్రియల్లో వినియోగదారులకు మరింత భరోసాను కల్పిస్తున్నాము,” అని అన్నారు.

ఈ కార్యక్రమంపై వ్యాఖ్యానిస్తూ, శ్రీ పినాకి హల్దార్, వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ – SCVPU, టాటా మోటార్స్ లిమిటెడ్ ఇలా అన్నారు, “స్వచ్ఛమైన రవాణాను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, సుస్థిరమైన చివరి మైలు రవాణా (Last-mile Logistics) దిశగా భారతదేశం సాగిస్తున్న పరివర్తనను వేగవంతం చేయడానికి టాటా మోటార్స్ కట్టుబడి ఉంది. మా ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌ల (e-SCVPU) శ్రేణి అత్యుత్తమ పనితీరు, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ వ్యయ ప్రయోజనాలను అందించేలా రూపొందించబడింది. అయితే, వాహన యాజమాన్యం మరింత సులభంగా, ముందుగానే అంచనా వేయగలిగేలా, ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా ఉన్నప్పుడే వాటి వినియోగం మరింత విస్తరిస్తుంది. టర్నోతో మా భాగస్వామ్యం వినియోగదారులకు సమగ్ర యాజమాన్య మద్దతును అందించడం ద్వారా మా ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఫైనాన్సింగ్‌కు సంబంధించిన అడ్డంకులను తొలగించడంతో పాటు, దీర్ఘకాలిక పునఃవిక్రయ విలువకు భరోసా కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులు మరింత విశ్వాసంతో ఉద్గార రహిత రవాణా వైపు మారేలా ప్రోత్సహిస్తున్నాము,” అని తెలిపారు.


విభిన్న రకాల కార్గో అవసరాలను తీర్చేందుకు పలు లోడ్ డెక్ కాన్ఫిగరేషన్‌లు, పేలోడ్ సామర్థ్యాల్లో అందుబాటులో ఉన్న ఏస్ ప్రో EV, ఏస్ EV 1000, ఇంట్రా EV పికప్‌లతో కూడిన విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌లను (e-SCVPU) అందిస్తూ, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల వినియోగ విస్తరణకు టాటా మోటార్స్ నాయకత్వం వహిస్తోంది. ఈ వాహనాలకు సమగ్రమైన సహాయక వ్యవస్థ తోడ్పాటునందిస్తోంది. ఇందులో భాగంగా, 150కి పైగా నగరాల్లో 25,000కు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను వినియోగించుకునే సదుపాయం, వాహనాల నిరంతర కార్యకలాపాలను (Uptime) పెంచేందుకు దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రత్యేక EV సపోర్ట్ సెంటర్లు, ‘సంపూర్ణ సేవ 2.0’ కింద సమగ్ర లైఫ్‌సైకిల్ సేవలు, టాటా మోటార్స్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లీట్ ఎడ్జ్’ ద్వారా ఫ్లీట్ నిర్వహణ సదుపాయాలు ఉన్నాయి. వీటితో పాటు, ప్రముఖ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), మొబిలిటీ ఫైనాన్షియర్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కూడా ఈ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్