- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కృష్ణా జిల్లా కంకిపాడు-మచిలీపట్నం జాతీయ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్‌లో పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో బైక్ దగ్ధం అయింది. అయితే వాహనదారుడు బైక్‌పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. బైక్ దగ్ధం అవుతున్న సమయంలో జాతీయ రహదారిపై భారీగా గ్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -


