Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిక్య నాయక్ పెద్ద తండ, గుడి కట తండ పంచాయతీలు ఏకగ్రీవం

బిక్య నాయక్ పెద్ద తండ, గుడి కట తండ పంచాయతీలు ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి : రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మండలంలోని బిఖ్య నాయక్ పెద్ద తండ, గుడికుంట తండ పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయని ఎంపీడీవో వర్కల వేదవతి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈనెల 3 నుండి 5 వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో ఆయా గ్రామాల నుండి సర్పంచులుగా, వార్డు సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారని తెలిపారు. ఈనెల తొమ్మిదిన సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో బిక్య నాయక్ పెద్ద తండా సర్పంచుగా బానోతు కమలమ్మ తోపాటు వార్డు సభ్యులు, గుడి కుంట తండా సర్పంచు వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -