నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో ఎఫ్ స్టీన్ ఫైల్ పై తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల యూఎస్ న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్‌లో బడానేతల చీకటి రాసలీలలు బట్టబయలైయ్యాయి. అందులో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ పేరు మారుమోగింది. తాజాగా ఈ అంశంపై ఆయన మాజీ భార్య మిలిందా మీడియాలో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ స్టీన్ ఫైల్ కారణంగానే గేట్స్‌కు విడాకులు ఇచ్చానని చెప్పారు. ఆ సెక్స్ రాకెట్ వ్యవహారంలో బిల్ గేట్స్ పేరు బయటకు రావడంతో తమ దాంపత్య బంధానికి స్వస్తి చెప్పానని తెలిపారు. ఇతర మహిళలతో బిల్ గేట్స్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలియడంతో తాను తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని వెల్లడించారు. ఆ క్షోభను భరించలేక మూడు దశాబ్దాల తమ వైవాహిక బంధాన్ని తెంచుకున్నట్లు మిలిందా వివరించారు.
కాగా, ఇటీవల విడుదలైన ఎప్ స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ కు సంబంధించిన పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఆయన పలువురు రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు నెరిపాడని, దీనివల్ల ఆయనకు సుఖవ్యాధులు సంక్రమించాయని ఆ ఫైల్స్ లో ఎప్ స్టీన్ పేర్కొన్నాడు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు ఆయన తన భార్య మిలిందాకు రహస్యంగా ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్ తనను అడిగారని తెలిపాడు. అయితే, ఈ ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది.



