- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, దాని ప్రభావంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ఏఐ రాకతో పారాలీగల్స్, ఎంట్రీ-లెవల్ అకౌంటెంట్ల వంటి కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన అంగీకరించారు. అయితే, ఇదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ ఒక గొప్ప వరంగా మారుతుందని, అనేక రంగాల్లో ఉత్పాదకతను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
- Advertisement -