Sunday, March 8, 2026
E-PAPER
Homeజాతీయంరేపు ఏపీలో పర్యటించనున్న బిల్ గేట్స్

రేపు ఏపీలో పర్యటించనున్న బిల్ గేట్స్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి ఏపీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లతో సమావేశమవుతారు.

ఆదివారం అందిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులతో బిల్ గేట్స్ బృందం సమావేశమవుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులను మరింతగా విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -