Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపద్మనాభయ్యకు ఆస్కీ ఉద్యోగుల జన్మదిన వేడుకలు

పద్మనాభయ్యకు ఆస్కీ ఉద్యోగుల జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) చైర్మెన్‌ పద్మభూషణ్‌ కే పద్మనాభయ్యకు ఆ సంస్థ ఉద్యోగులు 87వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సోమవారం బెల్లావిస్తా క్యాంపస్‌లో ఉద్యోగులు ఆయనతో కేక్‌ కట్‌ చేయించి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఆస్కీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు హరిహరన్‌, రేణు ప్రకాశ్‌, హసన్‌ సహా పలువురు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఓపీ సింగ్‌, డీన్‌లు డాక్టర్‌ జనార్థన్‌రెడ్డి, డాక్టర్‌ వల్లీ మానిక్‌రామ్‌, డాక్టర్‌ సుబోధ్‌, డాక్టర్‌ నిర్మల్యాబాగ్చి తదితరులు పద్మనాభయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. 1938లో జన్మించిన కే పద్మనాభయ్య కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శిగా విశేష సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన ఆస్కీ చైర్మెన్‌గా వ్యవహరిస్తూ, ప్రభుత్వ విధానాల రూపకల్పన, శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన తన సర్వీసులో, ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -