నవతెలంగాణ-వెల్దండ : వెల్దండ మండల కేంద్రం లో మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ జన్మదిన సందర్భంగా వెల్దండ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దండ బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను ఉప్పల వెంకటేష్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అలాగే మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ జన్మదిన, సంక్రాంతి పండగ పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు నగదు బహుమతితో పాటు చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు రమేష్ గౌడ్, కొండల్ యాదవ్, మహిపాల్ నాయక్, నాయకులు పూరి రమేష్, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, అశోక్, జంగిరి యాదగిరి , మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ , హనుమంతు నాయక్ తదితరులు ఉన్నారు.
వెల్దండలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



