Sunday, May 11, 2025
Homeసినిమాఫ్యాన్స్‌కి బర్త్‌డే గిఫ్ట్స్‌

ఫ్యాన్స్‌కి బర్త్‌డే గిఫ్ట్స్‌

- Advertisement -

హీరో విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు నేపథ్యంలో ఆయనతో సినిమాలు నిర్మిస్తున్న మేకర్స్‌ అధికారిక ప్రకటనలతోపాటు పోస్టర్లును రిలీజ్‌ చేసి, ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకులనూ సర్‌ప్రైజ్‌ చేశారు.
రూరల్‌ యాక్షన్‌ డ్రామాలో..
విజయ్‌ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రవి కిరణ్‌ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ‘ఎస్‌వీసీ 59’ మూవీ నుంచి ఓ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.ఈ పోస్టర్‌ ఇంటెన్స్‌గా ఉండి ఆకట్టుకుంటోంది.
రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభించనున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌, రచన దర్శకత్వం – రవికిరణ్‌ కోలా.
బ్రిటీష్‌ కాలం నేపథ్యంతో..
హీరో విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ రాహుల్‌ సంకత్యన్‌, ప్రెస్టీజియస్‌ బ్యానర్స్‌ మైత్రీ మూవీ మేకర్స్‌, టీ సిరీస్‌ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘వీడీ 14’. ఈ సినిమా బ్రిటీష్‌ కాలం నేపథ్యంతో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనుంది. విజయ్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో ధ్యాన ముద్రలో ఉన్న విజయ్‌ దేవరకొండ స్టిల్‌ ఆసక్తి కలిగిస్తోంది.
బ్రిటీష్‌ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఒక పవర్‌ఫుల్‌ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.
భారత ఆర్మీకి విరాళం..
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పేందుకు మన భారత సైన్యం ముందడుగు వేస్తోంది. ఇలాంటి సమయంలో నా బాధ్యతగా ఇండియన్‌ ఆర్మీకి విరాళం ప్రకటిస్తున్నాను. రాబోయో కొన్ని వారాల పాటు నా క్లాత్‌ బ్రాండింగ్‌ రౌడీ వేర్‌ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నాను. మేడ్‌ ఇన్‌ ఇండియా మాత్రమే కాదు మేడ్‌ ఫర్‌ ఇండియా అనే ఎమోషన్‌తో నేను ఈ విరాళాన్ని అందజేస్తున్నాను.
– విజయ్‌ దేవరకొండ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -