Sunday, April 12, 2026
E-PAPER
HomeNewsశ్రీ మంజునాథ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా బిట్ల అనిల్

శ్రీ మంజునాథ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా బిట్ల అనిల్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: కమ్మర్ పల్లి శ్రీ మంజునాథ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా బిట్ల అనిల్ ఘన విజయం సాధించారు. ఆదివారం మండల కేంద్రంలోనీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో శ్రీ మంజునాథ ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీ చేయగా హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో 21 ఓట్ల భారీ మెజారిటీతో బిట్ల అనిల్ ఘన విజయం సాధించారు.బిట్ల అనిల్ గత నాలుగు సంవత్సరాలుగా శ్రీ మంజునాథ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు బిట్ల అనిల్ మాట్లాడుతూ ఆటో యూనియన్ అభివృద్ధి కొరకై పాటుపడతానని, 24 గంటలు ఆటో యూనియన్ సభ్యుల సమస్యల పరిష్కారం కొరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉపాధ్యక్షులుగా తీగల రాజా గౌడ్, కార్యదర్శిగా సదరం రవి, మీనేష్, సలహాదారులు రాజేందర్, ఖాదర్ భాయ్, సుధాకర్, సుందర్ రవి, మారయ్య, సభ్యులుగాా కిట్టు, అఖిల్, రాజు, ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -