నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వాకౌట్ చేశారు . చాలా వరకూ కుర్చీలు ఖాళీ అయ్యాయి . ఇక నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హాలులో అర్ధం కాని అరుపులు ప్రతిధ్వనించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయినప్పటికీ నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగించారు. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ స్పష్టం చేశారు. హమాస్ అంతానికి గాజాలో తాము ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు.