నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్‌లో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్ పై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మంది సిబ్బంది సహా 241 మంది మరణించగా.. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. లండన్‌కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. మెడికల్ కాలేజీ హాస్టల్‌ను ఢీకొట్టి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటన జరిగిన సమయంలో విద్యార్థులు భోజనం చేస్తూ ఉండగానే మరణించారు. తాజాగా బయటకు వచ్చిన కొత్త వీడియోలో క్రాష్ సైట్ నుండి దట్టమైన పొగలు ఎగసిపడుతున్నప్పుడు విద్యార్థులు గుడ్డ తాళ్లను ఉపయోగించి ఒకరికొకరు తప్పించుకోవడానికి సహాయం చేసుకుంటున్న దృశ్యాలు నమోదయ్యాయి. మండుతున్న హాస్టల్ భవనం నుంచి తప్పించుకోవడానికి విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పై అంతస్తుల నుండి దిగడానికి వీడియోలో రికార్డయింది. ఎయిర్ ఇండియా జెట్ విమానం కూలిపోతుండగా నిస్సహాయంగా చూస్తున్న అనేక మంది ప్రజలు సమీపంలోని చెట్లపై కూర్చోవడం కూడా గమనించవచ్చు.
New video of Ahmedabad plane crash: When the plane hit the medical college hostel, the college students saved their lives by jumping from the windows.
— Devesh , वनवासी (@Devesh81403955) June 17, 2025
#AhemdabadPlaneCrash pic.twitter.com/luZIoSrxbg