Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంఎస్సైపై బీజేపీ కార్పొరేట‌ర్ కుమారుడి దాడి..

ఎస్సైపై బీజేపీ కార్పొరేట‌ర్ కుమారుడి దాడి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పోలీస్‌ అధికారిపై చేయి చేసుకున్న బీజేపీ కార్పోరేటర్‌ కుమారుడికి ప్రజలు దేహశుద్ధి చేశారు. యూపీలోని వారణాసిలో చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలి నుండి అతడిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు డీసీపీ గౌరవ్ బన్స్వాల్ శుక్రవారం తెలిపారు.

వివరాల ప్రకారం.. హుకుల్‌గంజ్‌కు చెందిన బీజేపీ కార్పోరేటర్‌ బ్రిజేష్‌ చంద్ర శ్రీవాస్తవ కుమారుడు హిమాన్షు శ్రీవాస్తవ. అతను గురువారం సాయంత్రం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ని చెంపపైకొట్టాడు. ఆగ్రహించిన ప్రజలు అతనికి దేహశుద్ధి చేశారు. ప్రజల నుండి అతనిని రక్షించేందుకు తిరిగి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. హిమాన్షుపై కేసు నమోదు చేసి, జైలుకు పంపినట్లు డిసిపి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -