నవతెలంగాణ-హైదరాబాద్: చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచకుంట బీజేపీ ప్రభుత్వం అన్నదాతలకు అన్యాయం చేస్తోందని కర్నాటక సీఎం సిద్దరామయ్య విమర్శించారు. 2019 నుంచి షూగర్ క్రేన్ పంటలకు కనీస మద్దతు ధర పెంచట్లేదని, రేటు పెంపుపై అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన స్పందనలేదని బీజేపీ సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆ రాష్ట్ర విధానసౌధ హాలులో చెరకు రైతులు, ఫ్యాక్టరీ యజమానులతో సీఎం సిద్ధరామయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చెరుకు పంటకు రేటు పెంచాలని చాలా సార్లు కేంద్రానికి లేఖలమీద లేఖలు రాశామని రైతులకు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం 6-05-2025న FRPని నిర్ణయించింది.” చక్కెర కర్మాగారాలు విక్రయించే విద్యుత్తుపై యూనిట్‌కు 60 పైసల పన్ను విధించే ప్రతిపాదనను తమ ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. చక్కెర పరిశ్రమలకు, ఆ పంట సాగు రైతులకు కేంద్రం సహకారం అందించడంలేదని మండిపడ్డారు.
చెరకు రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధర డిమాండ్ చేస్తూ బెలగావిలో గురువారం ఎనిమిదో రోజుకు చేరుకున్నారు. నిరసనకారులు పూణే-బెంగళూరు జాతీయ రహదారిని కూడా దిగ్బంధించారు. రైతులు తమ ఉత్పత్తులకు టన్నుకు రూ.3,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.


