Friday, October 3, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీ ‘అమీబా’ లాంటిది: ఉద్ధవ్‌ థాకరే

బీజేపీ ‘అమీబా’ లాంటిది: ఉద్ధవ్‌ థాకరే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే గురువారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీ కార్యక్రమంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ‘‘అమీబా’’ లాంటిదని ఉద్ధవ్ విమర్శించారు. ‘‘బీజేపీ తనకు నచ్చిన విధంగా వ్యాపిస్తుంది. తనకు నచ్చని విధంగా పొత్తులును ఏర్పరుచుకుంటుంది. పని పూర్తయిన తర్వాత, మరోదానికి మారుతుంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే కడుపు నొప్పి కలిగిస్తుంది. సమాజంలోకి ప్రవేశించినప్పుడు శాంతిక భంగం కలిగిస్తుంది’’ అని ఆయన అన్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని నకిలీ హిందుత్వ అని, అవకాశవాదం అని ఉద్ధవ్ ఆరోపించారు. ‘‘ఒక గాడిద పులి చర్మాన్ని ధరించింది’’అని తన ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమైన హిందుత్వ వారసత్వం తనతో ఉందని అన్నారు. హిందుత్వ పరిధిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్ని ఠాక్రే తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ దశాబ్ధాలుగా ‘‘విభజన విష ఫలాలను’’ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లడాన్ని, పాకిస్తాన్‌ తో క్రికెట్ ఆడటాన్ని, బిల్కిస్ బానో కేసులో దోషులకు బీజేపీ మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, హిందూ విలువలపై ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వద్దని ఠాక్రే చెప్పారు.

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై స్పందిస్తూ.. న్యాయం కోసం పోరాడటం ఇప్పుడు దేశద్రోహంగా ఉందని అన్నారు. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, ముంబైని అదానీకి అప్పగిస్తుందని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -