Thursday, May 15, 2025
Homeజాతీయంమహిళల పట్ల బీజేపీ చూపించే గౌరవం ఇదేనా..మహిళతో బీజేపీ నేత వీడియో వైర‌ల్‌

మహిళల పట్ల బీజేపీ చూపించే గౌరవం ఇదేనా..మహిళతో బీజేపీ నేత వీడియో వైర‌ల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ :మహిళా సాధికారత అంటూ లెక్చర్లు దంచే నేతలే వారి పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజానికి మాయని మచ్చగా నిలుస్తున్నారు. ఉత్ర‌ర ప్ర‌దేశ్ లో ప్రముఖ బీజేపీ నాయకుడు బబ్బన్ సింగ్ రఘువంశీ ఓ మ‌హిళతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇటీవలే ఓ విందుకు హాజరయిన బ‌బ్బ‌న్ సింగ్ అక్కడ ఆర్కెస్ట్రా‌లో అమ్మాయి డాన్స్ చేస్తూ బబ్బన్ సింగ్ వద్దకు రాగా.. అతడు ఆమెను ఏకంగా ఒళ్లో కూర్చొబెట్టుకుని తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమెకు ముద్దు కూడా పెట్టాడు. అయితే, ఈ తతంగాన్ని అంతా అక్కడున్న ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. కాగా, అదే ఆ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ నేత పంకజ్ రాజ్‌భర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ నాయకుడి ద్వంద్వ విధానాలు మీరూ చూడండంటూ కామెంట్ చేశారు. నిజాయితీ, భారతీయ సంస్కృతిపై తరచూ ఉపన్యాసాలు ఇచ్చే వారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన సమాన్య జనం మహిళల పట్ల పేరున్న నాయకుడు ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర రాజ్‌పుత్ మాట్లాడుతూ.. బబ్బన్ సింగ్ రఘువంశీ చేసిన పని సిగ్గుచేటని అభివర్ణించారు. మహిళల పట్ల బీజేపీ చూపించే గౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -