నవతెలంగాణ-హైదరాబాద్: ఒక బీజేపీ నేత ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపారు. రాజస్థాన్‌లోని టోంక్ సవాయి మాధోపూర్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనాపురియా ఆదివారం ఒక కార్యక్రమంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఒక ముస్లిం మహిళ తన పేరు చెప్పగా ఆమెకు దుప్పటి ఇవ్వవద్దని సుఖ్‌బీర్ సింగ్ చెప్పారు. ముస్లిం మహిళకు ఇచ్చిన బ్లాంకెట్‌ను వెనక్కి తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషించే వారికి దుప్పట్లు తీసుకునే హక్కులేదని తెలిపారు. ‘నా మాట వినండి, (ప్రధానమంత్రి) మోదీని దుర్భాషలాడే వారికి (దుప్పట్లు) తీసుకునే హక్కు లేదు. దాని గురించి మీరు చెడుగా అనుకుంటే నేనేమీ చేయలేను’ అని అన్నారు. ముస్లిం మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ముస్లిం మహిళల పట్ల బీజేపీ నేత వివక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



