నవతెలంగాణ-హైదరాబాద్: కల్నల్ సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ లోని మహిళ కాంగ్రెస్ విభాగం ఆందోళన చేపట్టింది. ఆ రాష్ట్రరాజధాని భోపాల్‌లో భారీ ర్యాలీ చేపట్టింది. కున్వర్ విజయ్‌షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ మంత్రి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను నిలువరించారు. మాటలతో కల్నల్ సోఫియా అవమానించిన సదురు మంత్రిని బీజేపీ ప్రభుత్వం కాపాడాలని చూస్తుందని, ఇప్పటి వరకు విజయ్ షాను రాజీనామా చేయాలని సీఎం కోరలేదని ఎంపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విభా పటేల్ మండిపడ్డారు. ఇది సోఫియాకు జరిగిన అవమానం కాదని, యావత్తు మహిళలకు జరిగిన భంగపాటు అని కాంగ్రెస్ నేత సంతోష్ కంసన అన్నారు.
బీజేపీ మంత్రి కున్వర్ విజయ్‌షాను బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES