Thursday, May 15, 2025
Homeజాతీయంకల్నల్ సోఫియాకు బీజేపీ మంత్రి క్షమాపణలు చెప్పాలి: సుప్రీం కోర్టు

కల్నల్ సోఫియాకు బీజేపీ మంత్రి క్షమాపణలు చెప్పాలి: సుప్రీం కోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షా మాట‌ల‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా త‌ప్పుపట్టింది. కల్నల్ సోఫియాకు క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషీ దేశ ప్రజలకు మీడియా ద్వారా వివరిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత, ఆ రాష్ట్ర మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖరేషీని ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో మంత్రి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు మంత్రిపై ఎఫ్ఐఆర్ చేయాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశఇంచింది. ఈ రోజు సాయంత్రంలోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేకుంటే కోర్టు దిక్కారం కింద డీజీపీపై కేసు పెట్టాల్సి వస్తుందని కోర్టు ఆదేశించి. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై స్పందించిన సీజేఐ మంత్రి తీరుపై మండిపడ్డారు. ఈ పిటిషన్ ను రేపు విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు.. ప్రస్తుతానికి అతనిపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -