- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే మాజీమంత్రి శివాజీ రావు కార్దిలే కన్నుమూశారు. మహారాష్ట్ర అహల్యానగర్ జిల్లాలోని రాహురి నియోజకవర్గం నుండి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కార్దిలే చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆయన మరణం పట్ల పలువురు నివాళులర్పిస్తున్నారు. తన సేవా దృక్పథం, ప్రజా సంబంధాల ప్రత్యేక శైలి కారణంగా కార్దిలే ప్రజల్లో ప్రత్యేకమైన ముద్ర వేశారు.
- Advertisement -